• 6-5-2010
  •  
  • భగ్గుమన్న బంగారం ధరలు
 


దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు ప్రతి పది గ్రాములకు ఏకంగా రూ. 365లు పెరిగి రూ. 17,615లకు చేరుకుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశంలోను ఒక్కసారిగా పెరిగాయని న్యూ ఢిల్లీ బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 
 
 
అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ప్రతి ఔన్సు బంగారం ధర 2.67 డాలర్లు పెరిగి 1,177.95 డాలర్లకు చేరుకోవడంతో దేశీయ బులియన్ మార్కెట్‌లోను ధరలు ఆకాశాన్నంటాయని వ్యాపారస్తులు తెలిపారు. ట్రేడింగ్‌లో వచ్చిన మార్పుల కారణంగానే బంగారం ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 
 
 
బంగారం ధరలు పెరగడంతో స్టాండర్డ్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు రూ. 365లు పెరిగి రూ. 17,615లకు చేరుకుంది, అదే 22 క్యారెట్ల బంగారం ప్రతి పదిగ్రాముల ధర రూ. 17,465లకు చేరుకుంది. ప్రతి సవరం(ఎనిమిది గ్రాములు) బంగారం ధర రూ. 14,150లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 
 
 
ఇదిలావుండగా వెండి ధరల్లో స్వల్ప మార్పులు సంభవించి ప్రతి కిలో వెండి ధర రూ. 250లు తగ్గి రూ. 27,600లకు చేరుకుంది.



  • నేటి బులియన్ మార్కెట్ ధరలు


 

   
నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

 

 

 
ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 17,220 అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 17,140గా ఉంది. కిలో వెండి ధర 27,950 రూపాయలుగా ఉంది.

 

 

 
విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 17,420 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,950 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,800 రూపాయలుగా ఉంది.

 

 

 
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 17,240 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 16,030 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,040 రూపాయలుగా పలుకుతోంది.
 
  •