08-05-2010
- రూ.18 వేలు దాటిన బంగారం ధర
: ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు ఐదు నెలల గరిష్ఠస్థాయికి చేరాయి. గత సంవత్సరం చివర్లో 18 వేల నుంచి కిందకు దిగిన బంగారం ధరలు మరోసారి ఆ స్థాయిని దాటాయి. శుక్రవారం నాటి సెషన్‌లో డిసెంబర్‌లో డెలివరీ అయ్యే 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర ఏకంగా 563 రూపాయలు పెరిగి 18 వేల రూపాయల వద్ద నిలిచింది. మొత్తం ఐదు లాట్ల వ్యాపారం డిసెంబర్ కాంట్రాక్టులుగా నమోదైనాయి. ఇదే సమయంలో జూన్‌లో డెలివరీ అయ్యే బంగారం ధర 110 రూపాయలు పెరిగి 17,873 రూపాయలకు చేరింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర క్రితం ముగింపుకన్నా 33.20 డాలర్లు పెరిగి 1,208.80 డాలర్లను అధిగమించింది.