14-4-2010
- నేటి బులియన్ మార్కెట్ ధరలు
నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,870 అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,780గా ఉంది. కిలో వెండి ధర 28,240 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 17,050 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,620 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,800 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 16,815 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,640 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,390 రూపాయలుగా పలుకుతోంది.
- మళ్ళీ ఎగబాకిన బంగారం ధరలు!!
విదేశీ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్నంటాయి. దీంతో దేశీయ పసిడి మార్కెట్లో ప్రతి పది గ్రాముల ధర ఏకంగా రూ. 175లు పెరిగి రూ. 17,000లకు చేరుకుంది. పదిహేడువేలకు చేరుకున్న పదిగ్రాముల బంగారం ధర రూ. 17,100ల వద్ద ముగిసిందని దేశీయ బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అదే విధంగా వెండి ధరలు ప్రతి కిలోగ్రాముకు రూ. 150లు పెరిగి రూ. 28,150లకు చేరుకుంది. ఆసియా పసిడి మార్కెట్లో ప్రతి ఔన్స్ బంగారం ధర 1170 డాలర్లకు చేరుకుంది. ఇది నిరుడు డిసెంబరు 4 తర్వాత బంగారం ధర పెరగడం ఇదే మొదటిసారని వ్యాపారస్థులు తెలిపారు. ఇరవైరెండు క్యారెట్ల బంగారం ప్రతి పది గ్రాముల ధర 16,950కు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.