• ఆకాశాన్నంటిన బంగారం ధరలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పైకెగసి రికార్డు సృష్టించాయి. దీంతో సోమవారం సాయంత్రం నాటికి స్టాండర్డ్ బంగారం ధర రూ. 16,700లకు చేరుకుంది. వినియోగదారులు నిత్యం బంగారం కొనుగోళ్ళు చేస్తుండటంతో దేశంలో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో స్టాండర్డ్ బంగారం ధర రూ. 45లు పెరిగి రూ. 16,710లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అదే గత వారాంతానికి బంగారం ధరలు రూ. 16,665ల నుంచి ప్రతి పది గ్రాముల బంగారం ధర రూ. 16,790లకు చేరుకుంది. అలాగే వెండి ధరల్లోను చాలా మార్పులు సంభవించి ఏకంగా వెండి ప్రతి కిలోధరలు రూ. 175లు పెరిగి రూ. 27,880లకు చేరుకుంది. అదే గత వారాంతానికి వెండి ప్రతి కిలో ధర రూ. 27,705లుగా ఉండింది. ఇదిలావుండగా బంగారం ధరలు, నగల్లో తయారీదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 25 శాతం పెరిగిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.