బంగారం భగభగ
బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రికార్డు స్థాయికి పెరిగి మళ్ళీ తగ్గిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయని ముంబై బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతుండటంతో స్టాకిస్టులు ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశారని, దీంతో బంగారం ధరలు ఆకాశాన్నంటాయని వ్యాపార వర్గాలు తెలిపాయి.
ముంబై బులియన్ మార్కెట్లో ప్రతి పది గ్రాముల బంగారం ధర రూ. 180లు పెరిగి రూ. 16,845కు చేరుకుంది. అదే మేలిమి బంగారమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ప్రతి పది గ్రాముల ధర రూ. 180 పెరిగి రూ. 16,925లకు చేరుకుంది.

అదే హైదరాబాద్లో మేలిమి బంగారం ధర రూ. 180లు పెరిగి ప్రతి పది గ్రాములు రూ. 17,050లకు చేరుకోగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 280లు పెరిగి ప్రతి పది గ్రాములు రూ. 16,900లకు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.