18-11-2009
18-11-2009
గరిష్టస్థాయికి చేరుకుంటున్న బంగారం ధరలు!
రోజురోజుకి బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతిరోజూ బంగారం ధర కొత్త రికార్డులను నమోదు చేసుకుంటోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇటు దేశీయ మార్కెట్లోనూ సోమవారం పసిడి ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ బంగారం ధర పది గ్రాములు (99.9 స్వచ్ఛత) కలిగిన బంగారం సోమవారం రూ. 90 పెరిగి రూ. 17, 015కు చేరింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర పది గ్రాములు రూ.95కి పెరిగి, 16, 630కు గరిష్ట స్థాయికి చేరింది. మరోవైపు.. ఈ ఏడాది సెప్టెంబరుతో ధరల వేగంతో బంగారం కంటే వెండిదే పైచేయిగా ఉంది. అయితే అక్టోబర్ నుంచి వెండి కన్నా బంగారం అత్యధికంగా పెరిగింది. అక్టోబర్ నుంచి వెండి ధరలు ఐదు శాతం పెరిగితే, బంగారం ధరలు 11 శాతం పెరిగాయి. రాబోయే నెలల్లో కూడా వెండి ధరల వేగంతో పోల్చితే బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.