20-11-2009
  • రూ 177, 4000కు చేరిన బంగారం ధర


ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చిత స్థితి బులియన్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను పెంచడంతో బంగారం ధరలు మరో రికార్డును నమోదు చేశాయి. గురువారం నాటి బులియన్‌ మార్కెట్‌ సెషన్‌లో 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధరలు క్రితం ముగింపుకన్నా 30 రూపాయలు పెరిగి 17,400 రూపాయలకు చేరాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం విలువ ఎన్నడూ లేనంతగా 1,154 డాలర్లకు చేరడంతోనే ధరలు మరింతగా పెరిగాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. చాలామంది ఇన్వెస్టర్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్న ఈక్విటీ మార్కెట్ల కన్నా బులియన్‌ మార్కెట్‌ లాభసాటిగా కనిపిస్తుండడంతో పెట్టుబడులను తరలిస్తున్నారని ఆర్‌కె జ్యూయలర్స్‌ అధినేత రాకేష్‌ ఆనంద్‌ వ్యాఖ్యానించారు. ఏదో ఒక దలో లాభాల స్వీకరణ జరిగి బంగారం ధరలు కరెక్షన్‌ దిశగా సాగుతాయని ఆయన అంచనా వేశారు. రూపాయి విలువ బలహీన పడుతుండడంతో మరికొంత కాలం బులియన్‌ ర్యాలీ కొనసాగసవచ్చని ఎస్‌ఎంసి గ్లోబల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ తేజాస్‌ సేథ్‌ వ్యాఖ్యానించారు. కాగా, స్టాండర్డ్‌ బంగారం 10 గ్రాములకు 17,250 రూపాయలకు, ఎనిమిది గ్రాముల సావరిన్‌ బంగారం ధర 13,500 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో వెండి ధర మాత్రం దాదాపు స్థిరంగా నిలిచింది. గురువారం నాటి సెషన్‌లో కిలో వె,డి ధర 28,600 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. 100 వెండి నాణల ధర కొనుగోలు ధర 34 వేల రూపాయల వద్ద, అమ్మకం ధర 34,100 రూపాయల వద్ద కొనసాగింది.
ఇదిలావుండగా, ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు సరికొత్త రికార్డుకు చేరువలో నిలిచాయి. నవంబర్‌ కాంట్రాక్టులో 10 గ్రాముల బంగారం ధర 17,145 రూపాయల వద్ద కొనసాగింది. డిసెంబర్‌ కాంట్రాక్టు ఓపెన్‌ ఇంట్రస్ట్‌లో మొత్తం 42.36 కిలోగ్రాముల బంగారం ట్రేడ్‌ అయింది.

  • నేటి బులియన్ మార్కెట్ ధరలు


నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర 17,280 నుంచి 17,300గా ఉంది. అలాగే 99.5 రకం బంగారం ధర రూ.17,190-.17,205-గా ఉంది. కిలో వెండి ధర రూ.28,695-28,960గా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) రూ.17,460 నుంచి రూ.17,270. ఆర్మమెంట్ బంగారం ధర రూ.15,890 నుంచి రూ.15,810గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.28,000 నుంచి రూ.28,000గా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 17,440 నుంచి రూ.17,180. ఆర్నమెంట్ బంగారం ఒక గ్రాము ధర రూ.1,622. కిలో వెండి ధర రూ.28,590 నుంచి 28,720 రూపాయలుగా ఉంది.