మరింతగా పెరగనున్న బంగారం ధర రెండు మూడు వారాల్లోనే రూ.17 వేలకు
సెప్టెంబర్ 3వ తేదీన 7 నెలల గరిష్ఠ స్థాయిలో 15,780 రూపాయల వల్ల ఉన్న బంగారం ధర రెండు రోజులకే 220 రూపాయలు పెరిగి 16 వేల రూపాయల ఆల్ టైం హైని తాకింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (28.34 గ్రాములు) బంగారం ధర 1000 డాలర్లను అధిగమించింది. వివిధ దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింతగా పతనం కానుందని వస్తున్న వార్తల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడిపెట్టడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దేశీయ మార్కెట్లో మరో 20 రోజుల వ్యవధిలో ఎన్నడూ చూడనంత ఎత్తుకు బంగారం ధర చేరనుందని బొనాంజా కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్ సత్సంగి అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా వచ్చే 10 రోజుల్లో భారత్‌లో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 16,500 రూపాయలకు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,080 డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. కీలకమైన 16 వేల రూపాయల స్థాయిని అధిగమించిన దేశీయ బులియన్ మార్కెట్లో స్వల్పకాల అప్‌ట్రెండ్ కనిపించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు సెప్టెంబర్‌లో సాధారణంగా బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయని ఎన్నో సార్లు నిరూపితమైందని, అదే పరిస్థితి ఇప్పుడూ కనిపిస్తోందని రెలిగేర్ కమోడిటీస్ ఇన్‌చార్జ్ సోమ్‌నాధ్ దేవ్ వివరించారు. ప్రస్తుతం ఈక్విటీ, మెటల్ మార్కెట్ల మాదిరిగానే బులియన్ సైతం మంచి రాబడులను అందిస్తోందని, ఇటీవలి కాలం వరకూ కరెక్షన్ దిశగా సాగిన షేర్ మార్కెట్ల కన్నా బంగారం మార్కెట్‌పైనే ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు మూడు రోజుల వ్యవధిలో బంగారం ధర దేశీయ మార్కెట్లో 10 గ్రాములకు 16,200 రూపాయలను తాకుతుందని, ఆపై 17 వేల దిశగా సాగవచ్చని బిఎన్‌పి పారిబాస్‌కు చెందిన ఆనంద్ జేమ్స్ వ్యాఖ్యానించారు. బంగారం ధరలు మరింతగా పెరిగితే ఆభరణాల వ్యాపారం, దిగుమతులపై ప్రభావం పడితీరుతుందని ఆయన అన్నారు.
కాగా, బంగారం ధరలు స్వల్పకాలికంగా పెరిగినప్పటికీ, మరోసారి కిందకు దిగివచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీ కొనసాగితే బులియన్ మార్కెట్లోని పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ వైపునకు వచ్చేస్తారు. అందువల్ల జనవరి-ఫిబ్రవరి నాటికి మళ్ళీ బంగారం ధరలు 14 వేల నుంచి 14,500 రూపాయల స్థాయికి చేరుతాయని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్వెస్టర్లు సైతం ఇదే విధమైన అభిప్రాయాలతో ఉన్నారు. పరిస్థితులను గమనిస్తే బంగారం ధరలు ఒకసారి కరెక్షన్ దిశగాసాగి అమ్మకాల ఒత్తిడి ఏర్పడితే 10 నుంచి 15 శాతం వరకూ కిందకు దిగిరావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఏదిఏమైనా దీర్ఘకాలంలో పెట్టే పెట్టుబడులకు బులియన్ మార్కెట్ మంచి రాబడులను అందిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం కన్నా బిస్కెట్ల రూపంలో జరిపే కొనుగోళ్ళ వల్ల అధికంగా లాభపడవచ్చు.