• ...................................................................................

  • 21-06-2009
బంగారం తాకట్టు -- చట్టం నిబంధనలు :
ఆర్థిక సమస్యల వలన మథ్య తరగతి కుటుంబీకులు తాము కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారాన్ని అత్యవసర పరిస్థితులలో వడ్డీ వ్యాపారస్థుల దగ్గర తాకట్టు పెడుతుంటారు. అయితే వడ్డీ వ్యాపారస్థుడు దురాశతో అత్యధిక వడ్డీలు వసూలు చేయడంలాంటి మోసాలకు పాల్పొడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో ఈ చట్టం గురించి తెలుసుకోవడం అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో తాకట్టు వ్యాపారస్తుల (పాన్‌ బ్రోకర్స్‌) చట్టం 2002 అమలులోకి వచ్చింది.
చట్టం ముఖ్యాంశాలు
ఈ చట్టం ప్రకారం ఎవరు కూడా లైసెన్సు లేకుండా సెక్షన్‌ 3(1) ప్రకారం ఈ తాకట్టు వ్యాపారం ఎవరూ చేయకూడదు.వడ్డీ వ్యాపారస్థుడికు ఒకటికి మించి ఆ షాపులు ఉన్నట్లయితే ప్రతి షాపుకి విథిగా లైసెన్సు పొందాలి.లైసెన్స్‌ పొందిన తాకట్టు వ్యాపారస్థుడు అతని షాపుపై లేదా వ్యాపార ప్రదేశంపై పాన్‌ బ్రోకర్‌, లేదా తాకట్టు వ్యాపారస్థుడు అని స్థానిక భాషలో రాయించాలి.
వాణిజ్య బ్యాంకులు బంగారాన్ని తాకట్టు పెట్టుకునే సందర్భంలో ఎంతైయితే వడ్డీ వసూలు చేస్తారో అంతకుమించి ఎక్కువ వడ్డీని తాకట్టు వ్యాపారస్థుడు తీసుకోకూడదు.
వడ్డీని కాకుండా తాకట్టు వ్యాపారస్థుడు బుుణం ఇచ్చే సమయం లో ఎటువంటి కమీషన్‌ గాని, బహుమతులుగాని, ఏ రూపంలోనూ వసూలు చేయరాదు.వసూలు చేసే వడ్డీ మొ త్తం తీసుకున్న అసలు మొత్తానికి మించకూడదు.
తాకట్టు పెట్టే సమయం లో తాకట్టు వ్యాపారస్థుడు తాకట్టు పెట్టిన వ్యక్తికి రుజువుగా పాన్‌ టికెట్‌ లేదా రశీదును చట్టం సూచించిన పద్ధతిలో ఇవ్వాలి. అలా రశీదు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టుకోకూడదు.కొన్ని సందర్బాలలో తాకట్టు రశీదు పోగొట్టు కొనడం, దొంగలించ బడటం లేదా కాలిపోవడం జరుగవచ్చు. అలాంటి సందర్భాలలో తాకట్టుదారు తాకట్టు వ్యాపారస్థున్ని నుంచి డిక్లరేషన్‌ ఫారమ్‌ తీసుకుని దానిని మేజిస్ట్రేటు లేదా నోటరీ ద్వారా గాని ధృవీకరింపబడి, తాకట్టుదారుని గుర్తించే వ్యక్తితో కూడా ధృవీకరింపచేసి దానిని తా కట్టు వ్యాపారస్థునికి ఇవ్వాలి.
తాకట్టు విడిపించుకోవటంతాకట్టు దారు తాను తీసుకున్న అసలు, వడ్జీతో సహా తాకట్టు వ్యాపారస్థునికి చెల్లించినట్లయితే తాను తాకట్టు పెట్టుకున్న వస్తువులను విడుదల చేసుకోవడానికి పూర్తి హక్కులు కలిగి వుంటాడు. అయితే తాకట్టు రశీదును తాకట్టు వ్యాపారస్తునికి అందజేయాలి. ఈ చట్టం ప్రకారం 2 సంవత్సరాలలోగా ఆస్తిని (తాకట్టు పెట్టిన వస్తువులు)విడుదల చేసుకోవాలి. అయితే తాకట్టుదారు, తాకట్టు వ్యాపారస్థుని మధ్య ఈ కాలాన్ని తగ్గించి గాని, ఎక్కువగా గాని ఒప్పందం రాసుకుంటే దాని ప్రకారం వారు వ్యవహరించాలి.
తాకట్టు వస్తువు అమ్మకంతాకట్టు వస్తువును తాకట్టు వ్యాపారస్థుడు బహిరంగ వేలం ద్వారా మాత్రమే అమ్మాలి. ఇతర పద్ధతిని అనుసరించకూడదు. వేలంలో తాకట్టు వ్యాపారస్థుడు ఆ వస్తువును కొనకూడ దు. బహిరంగ వేలంలో అమ్మ గా వచ్చిన సొమ్ము తాకట్టు ద్వా రా ఇవ్వవలసిన అసలు, వడ్డీ మరియు వేలం ఖర్చులు పోను అదనంగా మిగిలినట్లయితే దాని ని వేలం జరిగిన నెలరోజులలోపు తాకట్టుదారునికి అందచేయాలి. అలా చేసే పక్షంలో వేలం నెల దాటిన వారం రోజులలోపు లైసెన్సింగ్‌ అధారిటి వద్ద జమ చే యాలి. జరిగిన నెలలోపు సంబంధిత రికార్డులను, రిజష్ట్రారును తాకట్టుదారు కాని, అతని తరుపువారు కాని పరిశీలన చేసుకోవచ్చు.
తాకట్టు వ్యాపారస్థుని దగ్గర అగ్ని ప్రమాదం జరిగితే...తాకట్టు వ్యాపారస్థుని దగ్గర అగ్ని ప్రమాదం జరిగి తాకట్టు వస్తువులు పాడైనట్లయితే దానికి తాకట్టు వ్యాపారస్థడే బాధ్యత వహించి తాకట్టు వస్తువు విడుదల సమయంలోపల, అతనికి రావలసిన అసలు, వడ్డీని మినహాయించుకొని మిగిలిన వస్తువు విలువను తాకట్టుదారునికి చెల్లించాలి.
అలాగే తాకట్టు వ్యాపారస్థుని నిర్లక్ష్యం వల్ల లేదా అనుచిత వస్తువుకు తరుగుదల వచ్చిందని కోర్టును సంతృప్తి పరచగలిగితే కోర్టు తగిన సహేతుకమైన నష్టపరిహారాన్ని మంజూరు చేయవచ్చు.
తాకట్టు వ్యాపారస్థుడు చేయకూడని పనులు
1. 18 సం లోపు వయసున్న వ్యక్తి నుంచి బంగారాన్ని, మరే వస్తువును తాకట్టు పెట్టుకోకూడదు. అలాగే మతి స్థిమితం లేని వ్యక్తుల నుంచి, తాగుబోతుల నుంచి వస్తువులు తీసుకొని తాకట్టు పెట్టుకోకూడదు.
2, వేరొక తాకట్టు వ్యాపారస్థుడు ఇచ్చిన తాకట్టు రశీదును కొనడం కాని, మార్పు చేయటం కాని చేయకూడదు.
3, ఏ సాకుతోనూ తన వద్దనున్న తాకట్టు వస్తువును తాకట్టు వ్యాపారస్థుడు కొనకూడదు.
4, 18 సంవత్సరంలోపు వయసున్న వారిని తాకట్టు వ్యాపారంలో ఉద్యోగస్థులుగా నియమించకూడదు.
5, తాకట్టు పెట్టిన వస్తువును కొనే ఉద్దేశ్యంతో తాకట్టు వస్తువు విడుదల చేయటంలో ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు.
6, విడుదల చేసే సమయంలో తాకట్టు పెట్టే వ్యక్తితో ఆ వస్తువును అమ్ముటకుగాను, కొనుటకు గాని ఏ ఇతర పద్దతిలోను బదిలీ చేయటానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోకూడదు.
  • ..............