• 27-3-2010
  • తగ్గిన పసిడి దిగుమతులు
2010, ఫిబ్రవరిలో దేశీయ పసిడి దిగుమతులు ఏకంగా 15 శాతం క్షీణించి 28.8 టన్నులకు పరిమితమైనట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు నెలతో పోలిస్తే ధరలు పెరగడం, డిమాండ్‌ మంద గించడం వల్ల ఫిబ్రవరిలో బంగారం దిగుమతులు మందగించినట్లుగా మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా జనవరిలో పుత్తడి దిగుమతులు 34 టన్నులుగా ఉన్నట్లు బోంబే బులియన్‌ అసొసియేషన్‌ తెలియజేస్తుంది.