అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం మెరుపు కాస్త తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు ప్రతి పది గ్రాములకు రూ. 300లు తగ్గి రూ. 17 వేలకు చేరుకుంది. అదే విధంగా వెండి కూడా కిలోకు రూ. 100లు తగ్గి 27 వేల 650 రూపాయలకు చేరుకుంది.డాలర్ విలువ పెరగడంతో న్యూయార్క్లో బంగారం ధరలు మూడు శాతం తగ్గి ప్రతి ఔన్స్ 1100 డాలర్లకు చేరుకుంది. దీంతో దేశీయ బంగారం ధరలపై ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అదే ఆభరణాల బంగారం ధరలు ప్రతి పది గ్రాములకు రూ. 300లు తగ్గి 16 వేల 850 రూపాయలకు చేరుకుంది. ఇదిలావుండగా బంగారం ప్రతి సవరం(ఎనిమిది గ్రాములు) రూ. 50లు తగ్గి 13 వేల 950లకు చేరుకుంది. వెండి వారాంతపు డెలివరీ ధర ప్రతి కిలోగ్రాముకు రూ. 200లు తగ్గి 27 వేల 225 రూపాయలకు చేరుకుంది.
18-dec-2009/friday.
నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 17,185. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 17,100గా ఉంది. కిలో వెండి ధర 28,075 రూపాయలుగా ఉంది.
- విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 17,420 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,950 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,200 రూపాయలుగా ఉంది.
- చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 17,250 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర 1,604 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,470 రూపాయలుగా పలుకుతోంది.