తగ్గనున్న పసిడి ధరలు.
సామాన్యుడికి శుభ వార్త ! బంగారం ధరలు జూన్ మాసం కల్లా తగ్గనున్నాయి.
ప్రపంచం , ఆర్ధిక మాంద్యం నుండి అనుకున్నా దాని కంటే త్వరగా కోలుకునే సూచనలు కనిపించటం తో , మదుపరులకు బంగారం పట్ల మోజు తగ్గనున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తులం బంగారం జూన్ మాసం కి రూ. 13995/- తగ్గనున్నదని, ఆ తరువాత సెప్టెంబర్ నాటికి రూ. 15000/- చేరవచ్చాని అభిప్రాయ పడుతున్నారు. ఈ సంవత్సరాంతానికి రూ. 15830/- కి చేరవచ్చని ఆంచనా.ప్రభుత్వం అవలంబించిన ఆర్ధిక విధానాలతో ఆర్ధిక మాంద్యానికి కొంత మేరకు బ్రేక్ పడిందని, ఫలితం గా మదుపరులకు బంగారం మీద ఆసక్తి తగ్గిందన్న వాదన కూడా వినవస్తోంది. బంగారం ధరలు ఫిబ్రవరి 20కి రూ 16040/- కి చేరిందన్న వార్త మీకు తెలుసు. ఈ పెరిగిన ధరలను సోమ్ముచేసు కొనేందుకు చాలామంది గృహం లోని బంగారాని అమ్ముకోవటం, క్రొత్తగా కొనుగోలు లేక పోవటం వలన భారత దేశం తొలిసారిగా బంగారాని ఎగుమతి కూడా చేసింది.
ఏది ఏమైనప్పటికీ తగ్గు బంగారం ధరలు, రా బోయే పెళ్ళిళ్ళ సీజన్ లో సామాన్యుడికి కొంత ఊరట కలిగించనున్నది.