.



అక్షయ తృతీయ

అక్షయ తృతీయ -బంగారం షాపులు కస్టమర్లతో కిటకిటలాడాయి. బంగారం ధరలు బాగా పెరిగినప్పటికీ...ఈ రోజు ఒక గ్రామైనా బంగారం కొనుగోలు చేస్తే, తమ ఇంట లక్షి తాండవం చేస్తుందనే నమ్మకంతో కస్టమర్లు బంగారం షాపుల వద్ద బారులు తీరారు. అయినా మాంద్యం ప్రభావం సేల్స్‌ పై కనిపించింది. పరిమాణంలో గతేడాది కంటే తక్కువ బంగారం అమ్మకాలు జరిగాయని వర్తకులు అంటున్నారుసూర్యభగవానుడు అక్షయ పాత్రను పాండవులకు బహుకరించిన రోజే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజున కనీసం గ్రాము బంగారం కొన్న ఈ సంవత్సరం అన్ని సౌభాగ్యాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. దీంతో నగరంలోని పలు బంగారు దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి.అక్షయ తృతీయను పురస్కరించుకుని పేరున్న షాపులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలు దారులు బంగారం కొనడానికి క్యూడుతున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం జంటనగరాలలో కేవలం ఒక టన్ను బంగారం మాత్రమే అమ్ముడుబోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు బాగా పెరిగడంతో షాపులకు వచ్చిన కస్టమర్లు తక్కువ పరిమాణంలో బంగారాన్ని కొంటున్నారని ...దీంతో కస్టమర్ల సంఖ్య తగ్గక పోయినా, వ్యాపార పరిమాణం తగ్గిందని బంగారం వర్తకులు అంటున్నారు. అక్షయ తృతీయకు బంగారానికి సంబంధం లేదు: సత్యవాణిఇదిలా వుండగా అక్షయ తృతీయకు బంగారానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు సామాజికవేత్తలు .... కేవలం వ్యాపార సంస్థలు తమ బిజినెస్‌ను పెంచుకోవడం కోసమే ప్రకటనలు గుప్పించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారి వారు చెబుతున్నారు. అక్షయతృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి లాభం లేదని అన్నారు. ( tv5)