- 26-4-2010
- మార్చి నెలలో 27.8 టన్నుల బంగారం దిగుమతి
దేశంలో బంగారం వినియోగం జోరుగా సాగుతోంది. ఓ వైపు పసిడి ధరలు భగ్గుమంటున్నా... బంగారు నగలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అధిక ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా బంగారం దిగుమతి రికార్డు స్థాయిలో సాగుతోంది. గత మార్చి నెలలో 27.8 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది.
గత 2009 సంవత్సరం డిసెంబరు ఆఖరు నాటికి ఒక గ్రాము బంగారం ధర రూ.16000గా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రూ.18500 వేలకు పెరిగింది. బంగారం వంటి విలువైన వస్తువులపై పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
దీనిపై ముంబై నగర బంగారం యజమానుల సంఘం డైరక్టర్ సురేష్ హ్యూండాయ్ మాట్లాడుతూ బంగారం దిగుమతి గణనీయంగా పెరగుతోందని, అందువల్ల ఈనెలలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్పారు.
2009 నుంచి మార్చి 2010 వరకు దేశంలో బంగారం దిగుమతులు 13 శాతం పెరిగి 301.3 టన్నులుగా ఉందని ఆయన వివరించారు. అంతకుముందు సంవత్సరం ఇది 346.8 టన్నులుగా ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు.
22-april-2010/thursday.
నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,710 అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,620గా ఉంది. కిలో వెండి ధర 27,890 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 16,860 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,440 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,200 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 16,680 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,510 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,105 రూపాయలుగా పలుకుతోంది.