• గత రెండు రోజులుగా హెచ్చు తగ్గులమధ్య కొట్టుమిట్టాడిన బంగారం, వెండి ధరలు మంగళవారం బొంబాయి బులియన్ మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి. బంగారం ప్రతి పది గ్రాములకు రూ. 75లు పెరిగింది. అదే వెండి ప్రతి కిలోకు రూ. 265లు పెరిగినట్లు బొంబాయి బులియన్ అస్సోసియేషన్ (బీబీఏ) మంగళవారం తెలిపింది. అదే విధంగా ప్రపంచ బులియన్ మార్కెట్లో ప్రతి పన్నెండు ఔన్సుల బంగారం ధర 1,140.00 నుంచి 1,140.03 డాలర్లకు చేరుకుంది. అదే వెండి ప్రతి పన్నెండు ఔన్సుల ధర 17.84 నుంచి 17.86 అమెరికన్ డాలర్లకు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారు, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయిః 999 గ్రేడ్ వెండి(కిలో)రూ. 27,815లు, స్టాండర్డ్ బంగారం ప్రతి పది గ్రాముల ధర రూ. 16,580లుగా ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.